టీ వాలెట్‌పై చౌకధర దుకాణదారులకు శిక్షణ

Sat,September 21, 2019 12:17 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 298 మంది చౌక ధరల దుకాణ డీలర్లకు టీ - వాలెట్ వినియోగంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీ వాలెట్ వినియోగానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన కలెక్టర్ ఎస్.వెంకట్రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీ వాలెట్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాలెట్ అని దీని ద్వారా రేషన్ డీలర్ల ఆదా యం పెంచేందుకు ప్రభుత్వం సరఫరా చేసే సరుకుల పంపిణీ ద్వారా వచ్చే కమీషన్‌తో పాటు టీ వాలెట్ విధానాన్ని నిరంతరంగా వినియోగిస్తే రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం ఉంటుందన్నారు. డిజిటల్ లావాదేవీలు అనివార్యమైన ప్రస్తుత తరుణంలో అందరూ కూడా కొత్తదనం వైపు అడుగులు వేయాలన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ప్రజలకు అదనపు సేవలను డిజిటల్ లావాదేవీల రూపంలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. టీ వాలెట్ ద్వారా నగదు జమ చేయడంతో పాటు మొబైల్ రీచార్జీ, డిటీహెచ్, ఇంటర్నెట్ బిల్లులు, పోస్టుపెయిడ్, ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లులు వంటి సర్వీసులు వినియోగదారులు పొందవచ్చునని తెలిపారు. ఎలక్ట్రోల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించి ప్రతి రేషన్ డీలర్ కనీసం 100 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసి సరిచూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి హతీరాం, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles