పేటలో ప్లాస్టిక్‌పై అవగాహన ర్యాలీ

Sat,September 21, 2019 12:17 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో శుక్రవారం స్వచ్ఛత హీ సేవా, ప్లాస్టిక్ రహిత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కలెక్టర్ వెంకట్రావు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి పురవీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా స్వచ్ఛత హీ సేవ, ప్లాస్టిక్ రహితంపై ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, ఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రవీందర్, ఎంఈవో రాములు, మెప్మా సిబ్బంది, పురపాలక సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles