డ్రంకెన్‌డ్రైవ్‌లో నలుగురికి జైలుశిక్ష

Sat,September 21, 2019 12:18 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : మద్యం సేవించి వాహనం నడిపిన నలుగురు వ్యక్తులకు 20 రోజుల జైలుశిక్ష పడింది. అమరచింత ఎస్సై రామస్వామి తెలిపిన వివరాల మేరకు.. అమరచింత పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన నలుగురు యువకులను ఆత్మకూరు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 20 రోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. శిక్ష పడినవారిలో అమరచింతకు చెందిన జాఫర్, బుడ్డగాని తండాకు చెందిన హేమనాయక్, గద్వాలకు చెందిన పరశురామ్, తిర్మలాయపల్లికి చెందిన రాజు ఉన్నట్లు అమరచింత ఎస్సై రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన మద్యం తాగి వాహనాలు నడిపితే తప్పక శిక్షార్హులవుతారన్నారు. అదేవిధంగా నూతన రవాణా చట్టం నిబంధనలను వాహనదారులు పాటించాలని కోరారు.

గద్వాలలో పలువురికి జరిమానా
గద్వాల క్రైం : గద్వాల పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంకెన్‌డ్రైవ్ కేసులో పట్టుబడిన 12 మందికి రూ.17 వేల జరిమానా విధిస్తూ గద్వాల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఉషాక్రాంతి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు గద్వాల టౌన్ పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున, ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారన్నారు. అదే విధంగా గుట్కా అక్రమ రవాణా కేసులో ముగ్గురికి రూ.4,500 (ఒక్కొక్కరికి రూ.1,500), ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా మైక్ వినియోగించినందుకు రూ.1,500 జరిమానా విధించారని పోలీసులు తెలిపారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles