అల్జీమర్స్‌తో అటెన్షన్

Sat,September 21, 2019 12:21 AM

-ఏటా పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు
-మనిషిని స్తబ్ధు చేసే మతిమరుపు వ్యాధి
-వృద్ధాప్యంలో ఎక్కువగా వచ్చే అవకాశం
-ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి
-నేడు ప్రపంచ అల్జీమర్స్‌డే

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం): వృద్ధాప్యం శరీరానికే కాదు, జ్ఞాపకశక్తి కూడా జీవితమంతా గడించిన ఆనుభవాలు విస్మృతిలోకి జారిపోతాయి. చివరికి బాగా తెలిసిన సన్నిహితుల పేర్లు, సంబంధాలు కూడా మర్చిపోతారు. జ్ఞాపకం అనే సొరుగులో జ్ఞానం అనుభవాలు నిక్షిప్తమవుతుంటాయి. తిరిగి వ్యక్తమవుతుంటాయి. అలాంటివి క్షీణించిపొయే మనిషిని ఊహించడమే దుర్భరం అల్జీమర్స్ వ్యాధి మనిషిని ఈ స్థితికి తీసికెళుతుంది. ఇది మామాలుగా కొందరిలో ఉండే మతిమరుపు కాదు. మొత్తంగా మనిషిని స్తబ్ధుగా చేసే వ్యాధి. దీనివల్ల మొదటవ్యక్తి ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా వ్యక్తులను పోల్చుకోవడం, పరిసరాలను గుర్తుపట్టడం, వాటితో సంపర్కం తగ్గిపోతూ వస్తుంది. పూర్తిగా ఒంటరి వాళ్లయి పోతారు. అసలు తాము స్థబ్ధమైపోతున్నామనే సంగతే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు తెలియదు. శారీరకంగా కుంగిపోయే వృద్ధ్దాప్యాన్ని అల్జీమర్స్ దురాక్రమిస్తే వారితో ఎలా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం. అల్జీమర్స్ పల్ల ఆప్రమత్తత, వ్యాధిగ్రస్తులపై మానవీయ వ్యవహరశైలీ పెంచడానికి ఏటా సెప్టెంబర్ 21న అల్జీమర్స్ డేగా పాటిస్తారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..

మతిమరుపు రెండు రకాలు
వాస్క్యులర్ డిమానియా : మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగని వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. తరుచూ పక్షవాతం వచ్చేవారిలో, అధిక రక్తపోటు, డయాబెటిక్ అధిక కొలస్ట్రాల్ ఉన్నవారిలో, అల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ఆవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిపూర్తిగా తగ్గిపోయేదందుకు మందులు లేవు. సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే వ్యాధి తీవ్రంకాకుండా చికిత్స చేస్తారు.
సూడోడిమాన్సియా: ఈ వ్యాధికి వయస్సుతో సంబంధం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది వ్యాధి కాదు. దీనికి కొంతవరకు వైద్యం ఉంది. అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆల్కహాల్, మాదకద్రవ్యాలు వాడే అలవాటు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తరహా డిమాన్షియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఒకవేళ మెదడులో ఏవైనా కణతులు, ఇన్‌ఫెక్షన్లు ఉంటే కూడా అల్జీమర్స్ వచ్చే ఆవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మతిమరుపునకు చికిత్స
అల్జీమర్స్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే డొనోఫిజల్, ఇవాస్టిగ్నమిన్ వంటి మందులు ఇస్తారు. ఇటీవల మెదడులో హార్మోన్ల విడుదలై కణాలు యాక్టీవ్ అవుతాయి. ఈ వ్యాధిగ్రస్తులకు కుటుంబం, సమాజం నుంచి తగిన సహకారం అవసరం. వీరితో నిరంతరం ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండాలి. అదేవిధంగా వారి మెదడుకు పనిచెప్పడానికి చెస్, క్యారమ్స్ వంటి ఆటలు ఆడించాలి. వారు సొంతంగా చేయలేని పనుల్లో సహకరించాలి. తప్పులు చేస్తే విసుగు చెందకుండా ఓపిగ్గా వారికి తెలియజేప్తూ ప్రోత్సహించాలి. ఉద్యోగ విరమణ తర్వాత పనిచేయడం మానేయకుండా ఏదో ఒక వ్యాపకాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles