గుండుమాల్‌ను ఆదర్శ గ్రామంగా నిలపాలి : జెడ్పీ సీఈవో

Sun,September 22, 2019 02:18 AM

కోస్గిటౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముప్పై రోజుల మార్పునకు శ్రీకారం కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించి గుండుమాల్‌ను మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలపాలని జెడ్పీ సీఈవో కాళిందిని సూచించారు. శనివారం మండలంలోని గుండుమాల్‌లో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని, అలాగే ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. ముఖ్యంగా ఎంపీపీ గ్రామమైన గుండుమాల్‌ను మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జెడ్పీ సీఈవో వెంట ఎంపీపీ మధుకర్‌రావు, గ్రామ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్, సర్పంచ్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ రవీందర్ ఉన్నారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles