జాతీయ స్థాయికి ఎదగాలి

Sun,September 22, 2019 02:18 AM

ఊట్కూర్ (మక్తల్ రూరల్) : నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లా తరపున అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎదగాలని జెడ్పీ చైర్‌పర్సన్ కే వనజ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మక్తల్ మండలంలోని కర్నిలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అం డర్-17 ఖోఖో పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ఎస్‌జీఎఫ్ జెం డాను ఆవిష్కరించారు. అనంతరం ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కొత్త జిల్లాలో మారుమూల ప్రాంతమైన కర్నిలో జిల్లాస్థాయి ఖో-ఖో పోటీలను నిర్వహించడంతో పాటు జిల్లా జట్లను ఎంపిక చేసే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలోని 11మండలాలకు చెందిన బాలబాలికలు తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని ఆమె ఆ కాంక్షించారు. క్రీడారంగానికి తన వం తు చేయూతనిస్తానని ఆమె హామీ ఇ చ్చారు.

ఈ సందర్భంగా జిల్లాలోని 11 మండలాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన 22జట్ల క్రీడాకారులను జెడ్పీ చైర్‌పర్సన్ పరిచయం చేసుకుని భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. మక్తల్ మార్కెట్ క మిటీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచి జిల్లా జట్టు కు ఎంపికైనా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా కు పేరు తీసుకువస్తే, జిల్లా జట్టుకు తను సొంతంగా రూ.25వేల ప్రోత్సాహక బ హుమతిని అందిస్తానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, స ర్పంచ్ చిన్న బలరాం, ఎంపీటీసీ చిన్నరంగప్ప, హెచ్‌ఎం మామిళ్ల ప్రసాద్, పాఠశాల పీఈటీ బీ రూప, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రాం కళ్యాణి, పీడీలు, పీఈటీలు వెంకటేశ్, సోమ్లానాయక్, వడెన్న, రమేశ్, విష్ణు, నరేశ్, శ్రీవాణి, మీనాకుమారి, రేణుక పాల్గొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles