నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి

Sun,September 22, 2019 02:18 AM

ఊట్కూర్ (మక్తల్ రూరల్) : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ బతికించేందుకు గానూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు సాగాలని నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్ కే వనజ అన్నారు. మక్తల్ మండలంలోని కర్ని, సామన్‌పల్లి, మంథన్‌గోడ్ గ్రామాల్లో శనివారం హరితహారంలో భాగంగా ఆమె మొక్కలను నాటి నీళ్లను పోశారు. కర్నిలో గ్రామస్తుల సహకారంతో సమకూర్చిన 400ట్రీ గార్డులను ఆమె మొక్కల వద్ద ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధికి కర్ని గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండడం అభినందనీయమన్నారు. మార్పునకు శ్రీకారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న పనులను మరింత వేగంగా చేపట్టవలసిన అవసరం ఉందని ఆమె అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టపర్ల నర్సింహగౌడ్, ఎంపీపీ వనజ, ఎంపీడీవో పావని, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కర్ని సర్పంచ్ చిన్న బలరాం, ఎంపీటీసీ చిన్న రంగప్ప, హెచ్‌ఎం ప్రసాద్, పీఈటీ బీ రూప, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles