పట్టణ ఆరోగ్య కేంద్రాల రద్దు

Sun,September 22, 2019 02:19 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ, కుమ్మరివాడలో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు కొనసాగుతుండేవని, ఎన్‌యూహెచ్‌ఎం పథకం ప్రకారం యూహెచ్‌సీలు ప్రస్తుతం నిర్వహించడానికి వీలు లేదని, కలెక్టర్ ఉత్తర్వుల ద్వారా ఆగస్టు 1వ తేదీన వీటిని రద్దు చేయడం జరిగిందని జిల్లా మెడికల్, ఆరోగ్య అధికారి తెలిపినట్లు పీఆర్‌వో శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను వ్యాధి నిరోధక టీకాలు, ముఖ్యమైన ఆరోగ్య సేవలు అందించుటకు డిప్యుటేషన్‌పై పీపీ యూనిట్‌లో సర్దుబాటు చేయడం జరిగిందన్నారు. కుమ్మరివాడ అర్బల్ హెల్త్ సెంటర్‌కు సంబంధించి కొత్తగా డాక్టర్, ఏఎన్‌ఎంలను నియమించుటకు ఓ పత్రికలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన వచ్చిందని, ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఏలాంటి నియమకాలు చేపట్టడానికి వీలు లేదని ఆయన ప్రకటించారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles