నిబంధనలు గాలికి..

Sun,September 22, 2019 02:19 AM

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : జిల్లా కేంద్రంలో నిబంధనలు పాటించని డయాగ్నోస్టిక్ సెంటర్లపై డీఎంహెచ్‌వో రజిని కొరఢా ఝళిపించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం డయాగ్నోస్టిక్ సెంటర్లను డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించే ధరల పట్టిక బోర్డు, పరీక్షా ఫీజుల రశీదులు, రికార్డులను ఆమె పరిశీలించారు. ముందుగా రాజేంద్రనగర్‌లోని ప్రైమ్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లగా, అక్కడ ఎలాంటి ధరల పట్టిక లేకపోవడంతోపాటు, ని బంధనలకు విరుద్ధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రూ. 600 వసూ లు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, నిర్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ప్రభుత్వ జనరల్ దవాఖాన నుంచి వచ్చిన ఓ రోగి నుంచి డెంగీ నిర్ధారణ పరీక్ష కోసం రూ.600లకుపైగా వసూలు చేసినట్లు తనిఖీలో గు ర్తించారు. వెంటనే ఈ రెండు డయాగ్నోస్టిక్ సెంటర్లను డీఎంహెచ్‌వో సీజ్ చేశారు. ఈ తనిఖీలలో జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్లు నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles