ప్రగతి సూపర్

Sun,September 22, 2019 02:24 AM

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి వైపు..
- శ్రమదానానికి స్వచ్ఛందంగా కదిలిన జనం
- గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటామని ప్రకటన
-పల్లెప్రగతితో గ్రామంలో కనిపిస్తున్న మార్పు

ఖాజీపూమద్దూర్ మండలంలోని ఖాజీపూర్‌లో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికను గ్రామంలో అమలు చేసి మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు ముందుకు సాగుతున్నారు. శనివారం గ్రామాన్ని నమస్తే తెలంగాణ విలేకరి విజిట్ చేశారు.

శనివారం జరిగిన పనులు
- శనివారం ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి గ్రామ కార్యదర్శి ఎండీ రఫీ చేరుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ పెద్ద వీరారెడ్డి, ఉప సర్పంచ్ కే మమత, వార్డు సభ్యులు, గ్రామ ప్రత్యేకాధికారి వెంకటకృష్ణతోపాటు అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ఒక్కొక్కరుగా అక్కడి చేరుకున్నారు. అందరూ కలిసి ఖాజీపూర్‌లోని కొత్తగేరిలో పాడుబడ్డ బావులు, గుంతలను జేసీబీ సహాయంతో పూడ్చి వేయించారు.
- ఉదయం 11 గంటలకు అదే కాలనీలో ఇళ్ల మధ్య రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేశారు.
- మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఇళ్ల మద్య నుంచి వస్తున్న మురుగునీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు వీధిలైట్లు వేయాలని కోరగా ప్రతి విద్యుత్ స్తంభానికి ఎల్‌ఈడీ బల్పులను అమర్చనున్నట్లు తెలిపారు.
- మధ్యాహ్నం 1:30 నిమిషాలకు కొత్త కాలనీలోనే కావలికారు ఇంటి ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. 30 రోజుల ప్రణాళికా అంశాలను పంచాయతీ కార్యదర్శి రఫీ చదివి వినిపించారు. అనంతరం ప్రత్యేకాదికారి వెంకటకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుని, అందుకే మార్పునకు శ్రీకారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే సర్పంచ్ వీరారెడ్డి గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను గ్రామస్తులకు వివరించారు.
- మధ్యాహ్నం 2:30 నిమిషాలకు భోజన నిమిత్తం వారి ఇళ్లకు బయలు దేరి వెళ్లారు. భోజనానంతరం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు సమావేశమైన సభ్యులు మరుసటి రోజు చేపట్టవలసిన అంశాలపై చర్చించారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles