హిందూ ధర్మప్రచారానికి పెద్దపీట

Mon,September 23, 2019 06:16 AM

శ్రీశైలం: హిందూ ధర్మ ప్రచారానికి పెద్దపీట కమిషనర్ ఉత్తర్వుల మేరకు మారుమూల ప్రాంతాల్లో ఉండే భక్తులను కూడా దృష్టిలో ఉంచుకుని దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టనుందని కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. ఆదివారం పరిపాలనా విభాగం కార్యాలయంలో దసరా నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. దసరా నవరాత్రుల సందర్భంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా నవరాత్రులలో భాగంగా ప్రత్యేక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను, విద్యుద్దీపాలంకరణ, యాత్రికుల సమాచార సహాయ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పారు. అంతరించి పోతున్న కళలను కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించి పల్లె ప్రాంతాల కళాకారులకు, చెంచు కళాకారులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా క్షేత్ర పరిధిలో భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎస్‌వో శ్రీనివాస్‌రావును ఆదేశించారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీశైలప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, ఏఈవో కృష్ణారెడ్డి, దేవస్థాన న్యాయసలహాదారు గిరిధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles