పెబ్బేరు అన్నదాతకు రైతు నేస్తం అవార్డు

Mon,September 23, 2019 06:16 AM

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన యువరైతు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉప రాష్ట్రపతి వెంకటయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, రైతు నేస్తం చైర్మన్ పద్మశ్రీ వెంకటేశ్వర్‌రావు, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ గంటా చక్రపాణి చేతుల మీదుగా రైతు నేస్తం అవార్డును అందుకున్నారు. ఆదివారం శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ముప్పువరపు ఫౌండేషన్ సౌజన్యంతో రైతు నేస్తం-2019 ఈ అవార్డును అందించారు. యువరైతు ఇంజనీరింగ్‌లో పీజీ ఉన్నత చదువులు చదివి ఏడేండ్లపాటు హైదరాబాద్, బెంగళూర్ మహానగరాలలోని వివిధ కంపెనీలలో ఉద్యోగం చేశారు. వ్యవసాయంపై మక్కువతో 2014 నుంచి సేంద్రియ పద్ధతులలో వరి, బత్తాయి, మామిడి, కూరగాయలు, చిరుధాన్యాలు సాగు విధానాలతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. కాలానికి అనుగుణంగా వ్యవసాయరంగంలో అనేక పద్ధతులతోపై విశిష్ట కృషి చేస్తున్నారు. పరిశోధనలలో భాగంగా ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాన్ని అందజేశారు

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles