జూరాలకు కొనసాగుతున్న వరద

Mon,September 23, 2019 06:18 AM

-ఇన్‌ఫ్లో 65,000, అవుట్ ఫ్లో 67,706 క్యూసెక్కులు
-ఆల్మట్టి ఇన్‌ఫ్లో 31,824, అవుట్ ఫ్లో 31,824 క్యూసెక్కులు
-నారాయణపుర ఇన్‌ఫ్లో 30,000, అవుట్‌ఫ్లో 26,100 క్యూసెక్కులు

జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాలకు వరద స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 67,706 క్యూసెక్కులు నమోదైంది. మూడు గేట్లను ఎత్తి నదిలోకి 15,588క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తికి 46,454 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 6టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1045అడుగుల ఎత్తులో 9.657టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.9అడుగుల ఎత్తులో 9.521 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 640 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1000 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 500క్యూసెక్కుల నీటిని కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో రెండు మోటార్ల ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1 ద్వారా 130 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు కూడా వరద ప్రవాహం క్రమంగా తగ్గిపోయింది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 31,824 క్యూసెక్కులు కొనసాగుతుండటంతో అదేస్థాయిలో 31,824 క్యూసెక్కులతో నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నారాయణపుర ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 35,900, అవుట్‌ఫ్లో 34,795 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 37.56 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

తుంగభద్ర డ్యాంకు స్థిరంగా వరద
అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. టీబీ డ్యాం ఎగువ ప్రాంతం నుంచి తుంగభద్ర జలాశయానికి వరద స్వల్పంగా వచ్చి చేరుతోంది. ఆదివారం తుంగభద్ర జలాశయానికి 16,068 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 15,468 క్యూసెక్కులు నమోదైంది. 15,468 క్యూసెక్కుల నీటిని కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన కాల్వలకు విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 100.855 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి గాను 1633 అడుగుల నీటి నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువన వర్షాలు తగ్గడంతో టీబీ డ్యాంకు వరద స్వల్పంగా చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 13,979 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 18,950 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 579 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో 291 క్యూసెక్కులు ఆయకట్టుకు చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

సుంకేసులకు తగ్గుతున్న వరద
రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి ఆదివారం సాయంత్రానికి 14,800 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లో రాగా, మూడు గేట్లను తెరచిన అధికారులు 13,200 క్యూసెక్కులు దిగువకు వదిలారు. కేసీ కెనాల్‌కు 1800 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

శ్రీశైలం గేట్లు మూసివేత
నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం గేట్లు మూతబడ్డాయి. వారం రోజుల నుంచి ఎగువన జూరాల, సుంకేసుల నుంచి వచ్చిన వరద నీటితో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ఈ సీజన్‌లో రెండోసారి శ్రీశైలం గేట్లను తెరిచారు. రెండు రోజులుగా ఇన్‌ఫ్లో పడిపోవడంతో ఆదివారం గేట్లను మాసివేశారు. ఆదివారం సాయంత్రం నాటికి జూరాల నుంచి 61వేల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 13,236 క్యూసెక్కుల చొప్పున కేవలం 75,236క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు గరిష్ట మట్టం 885 అడుగులకు గాను 884అడుగులకు చేరగా 215.807టీఎంసీల సామర్థ్యానికి గాను 215.3263టీఎంసీలకు చేరుకొన్నది. ఇక ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తికి గాను కుడిగట్టు విద్యుత్ కేంద్రానికి 25,903క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రానికి 40,259క్యూసెక్కుల చొప్పున నీళ్లు వెళ్తున్నాయి.

ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: చదువుతోపాటు క్రీడల్లో రాణించాని ఎస్‌జీఎఫ్ అండర్-19 సెక్రెటరీ పాపిరెడ్డి అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బాలబాలికల బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, క్రీడల్లో రాణించాలని అన్నారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కోదవలేదని, ఎంతోమంది రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తురని గుర్తుచేశారు. ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ చాటి జట్టు విజయానికి కృషి చేయాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో శైలజ, వ్యాయమ ఉపాధ్యాయులు ఫారుఖ్‌ముకుర్రం, బాలు, శైలజా, ఖలీల్, రాంమోహన్ పాల్గొన్నారు.

బాలురు జట్టు:రాఘవేందర్, అప్రోజ్‌అలీ, కేశవులు, చెన్నయ్య, యాసర్‌అస్లామ్, సందీప్‌కుమార్, శ్రీనివాసులు, శివప్రసాద్, అదిశేషు అన్నమయ్య,(మహబూబ్‌నగర్), శ్రావణ్(జడ్చర్ల), ఫిర్దోస్, అల్తాఫ్,(నారాయణపేట).
బాలికల జట్టు : జ్యోతి, ప్రియాంక, అర్చిత, సంధ్య, వందన, స్వర్ణలత, మహేశ్వరి, భార్గవి, స్వప్న, రేణుకా, సునీత, తుణుశ్రీ, హరికచౌహన్ (మహబూబ్‌నగర్), మంజుల, స్వాతి(నారాయణపేట).


20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles