సర్పంచ్, కార్యదర్శుల నిర్బంధం

Sun,October 6, 2019 01:21 AM

పెంట్లవెల్లి : మండల పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో అక్రమ నల్లా కనెక్షన్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం గ్రామ సర్పంచ్ తిరుపాటి నాగరాజుతో పాటు పంచాయతీ కార్యదర్శి గోపాల్, ఉప సర్పంచ్ నరసింహ్మలను గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్సై ఖయూం, డీపీఎల్‌వో సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో గంగమోహన్, ఈవోఆర్‌డీ సునీతలు గ్రామానికి చేరుకొని సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో గొడవ సద్దుమణిగింది.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles