మాగనూర్ : తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నలా వారిని గౌరవించి బతుకమ్మ పండుగకు చీరలు అందిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వర్కూర్ గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన త ర్వాత మన సాంస్కృతిని నలు దిక్కులా చాటేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, వైస్ ఎంపీపీ తిప్పయ్య, సర్పంచు నిర్మలమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, తహసీల్ధార్ విద్యాసాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.