పచ్చదనం వెల్లివిరియాలి

Mon,October 7, 2019 02:27 AM

-ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలి
-సంరక్షణ బాధ్యత తీసుకోవాలి
-మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
-మక్తల్ వాసవీ మాత ఆలయంలో హరితహారం

మక్తల్ రూరల్ : మక్తల్ నియోజకవర్గంలోని అన్ని ఆలయాల ప్రాంగణాల్లోనూ హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటడం ద్వారా పచ్చద నం వెల్లివిరియాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలను నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణాల్లో మొక్కలను నాటడంతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తేనే చక్కని ఫలితాలు ఉంటాయన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చిట్టెం దంతపలు వాసవిమాతను దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, మార్కెట్ చైర్మన్ పి.నర్సింహాగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, మాగనూరు జెడ్పీటీసీ వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్‌గుప్తా, ఎల్లారెడ్డి, శ్రీహరి, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవీక్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీర ఆడపడుచుల గౌరవం
మాగనూర్ : తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నలా వారిని గౌరవించి బతుకమ్మ పండుగకు చీరలు అందిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వర్కూర్ గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన త ర్వాత మన సాంస్కృతిని నలు దిక్కులా చాటేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, వైస్ ఎంపీపీ తిప్పయ్య, సర్పంచు నిర్మలమ్మ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, తహసీల్ధార్ విద్యాసాగర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles