వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

Sat,October 12, 2019 01:57 AM

పెద్దమందడి : మం డలంలోని వీరాయపల్లి గ్రామంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏ ర్పాటుకు గాను శుక్రవా రం శాస్త్రవేత్తల బృం దం స్థలాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేర కు సర్వే నంబర్ 137 లో 21.20 ఎకరాల ప్ర భుత్వ భూమిని రెవె న్యూ అధికారులు వేరుశనగ పరిశోధన కేంద్రానికి కేటాయించారు. ఈ స్థలంలో యునివర్సిటీ ఏర్పాటు అనుకూలమా..? కాదా..? అనే విషయంపై పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టర్ అవిన్‌కుమార్‌యాదవ్, డాక్టర్ రమణ, డాక్టర్ బాబులతో పాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తల బృందం స్థలాన్ని పరిశీలించారు. పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని అనిల్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రఘుపతిరెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లయ్య, డిప్యూటీ తాసిల్దార్ నాగరాజు, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజాప్రకాష్‌రెడ్డి, సర్వేయర్లు, వీఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

15
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles