నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Sat,October 12, 2019 01:58 AM

కోస్గి టౌన్ : ఎలాంటి అనుమతులు లేకుండా అక్ర మంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టు బడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ ట్రాక్టర్లను పట్టుకున్నారు. మండలంలో జోరుగా ఇసుక రవాణా కొనసాగుతుందన్న పక్కా సమాచారం మేరకు.. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన పక్కాగా నిఘా ఏర్పాటు చేయిస్తున్నారు. అక్రమ ఇసుకను అరికట్టాలని టాస్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు పక్కా సమాచారం సేకరిస్తున్నారు. ఆ సమాచారంతోనే మండలంలోని బిజ్జారం గ్రామానికి చెందిన మూడు ట్రాక్టర్లు, కడంపల్లికి చెందిన మరో ట్రాక్టర్‌ను ఇసుక తరలిస్తుండగా బొలవోనిపల్లి గ్రామ శివారులో పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వరుసగా అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టుబడటంపై జిల్లా అధికారులు నిఘా పెంచారు. స్థానిక అధికారుల అండతోనే ఈ దందా కొనసాగు తుందన్న వాదనలపై సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles