జొన్నకు పెరుగుతున్న ధరలు

Sun,October 13, 2019 02:11 AM

జడ్చర్ల : జొన్నధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం జొన్నకు రూ.2,816 ధర పలికింది. శుక్రవారం జొన్నకు మార్కెట్‌లో అత్యధికంగా 2,529 ధర రాగా, శనివారం రూ.2,816 ధర పలికింది. దాంతో దాదాపు 287 రూపాయలు ఎక్కువగా ధర వచ్చింది. అదేవిధంగా ఆముదాలకు కూడా శుక్రవారం కంటే శనివారం 37 రూపాయలు అధిక ధర పలికింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 700 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా రూ.2,173 ధర వచ్చింది. కనిష్టంగా రూ.1,463 ధర రాగా మద్యస్తంగా రూ.1,559 ధర పలికింది. అదేవిధంగా 152 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.4,129 ధర రాగా కనష్ఠంగా రూ.3,825, మద్యస్తంగా 4,129 ధర పలికింది. అదేవిధంగా 26 క్వింటాళ్ల హంస రకం ధాన్యం అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా రూ.1,526 ధర రాగా కనిష్ఠంగా రూ.1,359, మద్యస్తంగా 1,359 ధర పలికింది. అదేవిధంగా 20 క్వింటాళ్ల జొన్న అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా రూ.2,816, కనిష్ఠంగా రూ.1,551, మద్యస్తంగా 2,551ధర పలికింది. 3 క్వింటాళ్ల సజ్జలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.2223 ధర పలికింది.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles