8వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

Sun,October 13, 2019 02:12 AM

నారాయణపేట రూరల్‌ : ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శనివారం 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డిపో నుంచి కార్మికులు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌, సీపీఎం నాయకులు వెంకట్రామిరెడ్డి, టీడీపీ నాయకులు ఓంప్రకాశ్‌, బీజేపీ నాయకులు ప్రభాకర్‌వర్ధన్‌, రఘువీర్‌యాదవ్‌, రఘురామయ్య గౌడ్‌, నందూ నామాజీ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కాశీనాథ్‌తోపాటు పలు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు.

కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యం లో శనివారం కార్యచరణను ప్రకటించారు. ఈ నెల 13న వంటా వార్పు, 14న రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు బైఠాయింపు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, 17న ధూందాం, 18న బైక్‌ ర్యాలీలు, 19న బంద్‌ నిర్వహించనున్నట్లు ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles