ఆగని ఆర్టీసీ చక్రం

Mon,October 14, 2019 01:57 AM

నారాయణపేట,ప్రతినిధి, సమస్తేతెలంగాణ: జిల్లా ఆర్టీసీ కార్మికుల ఆర్టీసీ కార్మికుల సమ్మెను అధిగమించి అధికారులు చర్యలు తీసుకొని ప్రయాణికులను చేరవేస్తున్నారు. కార్మికులు 9వ రోజు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను యథావిధిగా జిల్లాలో నడిపించారు. ఉదయం నుంచే ప్రయాణికులు వారి, వారి గ్రామాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవడంతో జిల్లాలో ఉన్న 79 ఆర్టీసీ బస్సులకు 50బస్సులు, 34హైయిర్ బస్సులు ప్రయాణికులను చేరవేశారు. మరో 130కి పైగా ప్రైవేట్ క్రూజర్లు, తుఫాన్లు, 1500ఆటోలు ప్రయాణికులను చేరవేశాయి. దాదాపు 17వేల మందికి పైగా తమ ప్రయాణాలను సాగించారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles