పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Mon,October 14, 2019 01:58 AM

-పేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వనజ
కోయిలకొండ: చారిత్రక ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వనజ తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కోయిలకొండ మండల కేంద్రంలో ప్రసిద్ధి చారిత్రక ప్రదేశాలు శ్రీ రామకొండ, ఖిల్లా కోట గురించి పూజారులను అడిగి తెలసుకున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్‌బండ్, మయూరి పార్క్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు మంత్రి శ్రీనువాస్‌గౌడ్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. నారాయణపేట ని యోజకవర్గాని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ దంపతులను సత్కరిం చారు. కార్యక్రమంలో పేట జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణచారి, పూజారులు రఘురామాచారి, నర్సింహచారి, గురురాజచారి లు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles