ఘనంగా వాల్మీకి జయంతి

Mon,October 14, 2019 01:58 AM

మక్తల్‌రూరల్ :మక్తల్ పట్టణంతో పాటు మండలంలోని కర్రె, ఖానపూర్, అనుగొండ, గుడిగండ్ల, సంగంబండ, భూత్పూర్, సత్యవార్, ముష్టిపల్లి, గడ్డంపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి అలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొని వాల్మీకి చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని దేశంలోని యువత అందరూ సామాజిక స్పృహతో మెలిగి దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మార్కేట్ కమిటీ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, నాయకులు వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డి, అక్కల సత్యనారాయణ, కర్రె స్వామి, వాల్మీకి సంఘం నాయకులు పీఈటీ గోపాలం, వెంకటేశ్, రవి, అంజనేయులు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles