రియల్ మాయ

Mon,October 14, 2019 02:01 AM

-ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
-అనుమతులు లేకుండానే రియల్ వ్యాపారం
-నాలా అనుమతి లేకుండా ప్లాట్లు చేస్తే చర్యలు తప్పవు : తాసిల్దార్ హైమద్‌ఖాన్
- నాలా లేని వెంచర్లను తొలగిస్తాం : కమిషనర్ శ్యామిల్‌జాన్

కోస్గిటౌన్ : కోస్గి పట్టణంలో ఇటీవత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఎలాంటి అనుమతి లేకుండానే వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హంగు ఆర్భాటాలు చేసి చూయించి 5 నుంచి 20 వేలు గజం చొప్పున మున్పిపల్ అనుమతి ఉందని ప్రజలను మోసం చేస్తున్నారు. కొందరు బ్రోకర్లు మధ్యవర్తిత్వం వహిస్తూ అధికారుల చేతులు తడపడంతో అందుకు అనుగునంగానే కాసులకు కక్కుర్తిపడి అధికారులు ఇష్టానుసారంగా అనుమతులిస్తున్నారు. దీంతో జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఏడాదిక్రితం ఇదేవిషయంపై జిల్లా అధికారులకు పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు మున్సిపాలిటీ లే అవుట్ లేని వెంచర్లు తొలగించాలని చెప్పడంతో స్థానిక అధికారులు ఉరుకులు పరుగులతో అక్రమ వెంచర్ల రాళ్లను తొలగించి అనుమతి తీసుకోవాలని హెచ్చరించారు. దీంతో కొంతకాలం సైలెంటయిన బ్రోకర్లు వెంచర్ నిర్వాహకులు మళ్లీ ఈ మధ్యన నిబంధనలను గాలికి వదిలి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు.

మున్సిపల్ డీటీపీసీ అనుమతి ఉందని విక్రయాలు
కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ప్లాట్ల విక్రయదారులు మున్సిపాలిటీ డీటీపీసీ అనుమతి ఉందని ప్రజలను నమ్మిస్తున్నారు. ఇంటికోసం మున్పిపల్ అనుమతి ఇప్పిస్తామని వేల రూపాయలకు గజం చొప్పున ప్లాట్లు అమ్ముతున్నారు. మున్సిపల్ డీటీపీసీ అనుమతి ఉంటే మొత్తం చేసిన వెంచర్లో 10 శాతం భూమి మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీరోడ్ల ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి ఉండాలి అవేవి లేకుండానే అన్నీ అనుమతులున్నాయని వెంచర్లు వేస్తున్నారు. ఒకటే ప్లాటు ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేస్తున్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles