జనరల్ దవాఖాన, మెడికల్ కళాశాలలో ఎంసీఐ బృందం తనిఖీ

Tue,October 15, 2019 02:20 AM

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం సోమవారం తనిఖీ నిర్వహించింది. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ నాల్గవ తరగతి వైద్య విద్య అనుమతి కోసం పరిశీలన చేశారు. అలాగే, జనరల్ దవాఖానలో ప్రజలకు అందుతున్న వై ద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం దవాఖానలో, మెడికల్ కళాశాలలో వసతులు, ఎలాంటి వైద్యసేవలు అందిస్తున్నారని కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలోని అత్యవసర విభాగం, ఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, వివిధ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ప్రసూతి వార్డులతోపాటు పార్మసీ విభాగం, ఓపీ విభాగం, కంటి విభాగం, లేబర్ రూంలతోపాటు వివిధ వార్డులను తనిఖీ చేశారు. మంగళవారం కూడా ఎంసీఐ బృందం తనిఖీ నిర్వహించనున్నారు. వీరివెంట డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, మెడిసిన్ విభాగం హెచ్‌వోడీ నిశాంత్, ఏడీ కార్తీక్‌రెడ్డి, ఏఈ శరత్ తదితరులు ఉన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles