-జెడ్పీ చైర్ పర్సన్ కే వనజ
దామరగిద్ద : మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కే వనజ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం అందించిన చేప పిల్లలను వందశాతం సబ్సిడీతో ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క మత్స్యకారుడు చేప పిల్లలను తమ తమ గ్రామాల చెరువులో వదిలి వాటిని సంరక్షించుకొని వాటి ద్వారా ఉపాధి పొందాలని, ముఖ్యం గా మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, స్థానిక సర్పంచ్ వన్నడి ఆశమ్మ, విశ్రాంత ఉద్యోగులు చిలుక మొగులప్ప, చాపలి వెంకటప్ప, నాయకులు వన్నడి చంద్రకాంత్, పుట్టి అంజితోపాటు వివిధ గ్రామాల మత్స్య కార్మిక సంఘం నాయకు లు, మత్స్యకారులు పాల్గొన్నారు.