ధన్వాడలో 14 మందికి అస్వస్థత

Thu,October 17, 2019 02:28 AM

మరికల్ : ధన్వాడ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం సుమారు 14 మంది అస్వస్థతకు గురై ప్రభుత్వ దవాఖానలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి బుధవారం గ్రామానికి చేరుకొని దవాఖానలో చికిత్సలు పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం అంబేద్కర్‌నగర్‌లో పర్యటించి అస్వస్థకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వల్ల గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని ఆమె తెలిపారు. అయితే డీఎంహెచ్‌వో కలుషిత నీటితోపాటు కుళ్లిన మాంసం తినడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు. డీఎంహెచ్‌వో వెంట డాక్టర్ వెంకటదాసు, గ్రామ సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి, తాసిల్దార్ రాములు ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles