విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి

Fri,October 18, 2019 02:16 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో ఉషారాణి అన్నారు. గురువారం ఆర్‌వీఎం సమావేశ మందిరంలో సీఆర్పీలతో నిర్వహించిన సమీ క్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏబీసీ మూలాల్లోకి వెళ్దామనే కార్యక్రమా న్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొం దుపర్చాలని సూచించారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఏ ర్పాటు చేసి విరామ సమయంలో విద్యార్థులతో పుస్తకాలు చదివించాలని తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయాలకు సంబంధించి నూతన అకౌంట్లను ఏ ర్పాటు చేసుకోవాలన్నారు.

అలాగే, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులు నిర్వహించాలని సూ చించారు. పాఠశాలల ప్రారంభం కంటే ముందే పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారా న్ని అందుబాటులో ఉంచాలని వెల్లడించారు. అనంతరం యూత్ క్లబ్, ఏకో క్లబ్‌లపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఎంవో హేమచంద్రుడు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles