పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

Mon,October 21, 2019 01:45 AM

మక్తల్ రూరల్: ప్రజలకు రక్షణ కల్పించడంతో వేలాది మంది పోలీసులు అమరులయ్యారని, వారి ప్రాణత్యాగాలు మరువలేనివని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మక్తల్ పోలీసు శాఖ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమన్నారు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది ప్రతిరోజూ రక్తం లభించక ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అందుకే ప్రతి ఒక్కరరూ తమవంతు బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలన్నారు. రక్తదాన శిబిరంలో దాదాపు 100మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొని తమవంతుగా రక్తదానం చేశారు. మక్తల్ సీఐ శంకర్, ఎస్సై అశోక్‌కుమార్, మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు జగన్నాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, కొత్తకాపు గోవర్ధన్‌రెడ్డి, వల్లంపల్లి లక్ష్మణ్, రెడ్‌క్రాస్ నటరాజ్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు బోయ రవి, ప్రతినిధులు అంబదాస్, అనుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles