ప్లాస్టిక్హ్రిత సమాజంగా మార్చాలి

Mon,October 21, 2019 01:45 AM

ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో వాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజంగా మార్చాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మక్తల్ భవసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రజలకు పేపర్, బట్టలతో తయారైన బ్యాగులను ఎమ్మెల్యే చిట్టెం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకంతో జీవకోటి మనుగడకు ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరిత, మార్కెట్ చైర్మన్ పట్టపర్ల నర్సింహగౌడ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, వెంకటయ్య, గోవర్ధన్‌రెడ్డి, గాల్‌రెడ్డి, రాజమహేందర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్, భవసార క్షత్రియ సమాజ్ సభ్యులు శ్రీనివాస్‌రావు, అంబదాస్, నారాయణరావు, లక్ష్మణ్‌రావు, అంబాజీ, బాబురావు, మల్లికార్జున్, రంజన, విజయలక్ష్మి, అనుసూయ, మాధురి తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles