లెక్క తేలింది..!


Fri,July 12, 2019 02:07 AM

ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ బల్దియా ఓటర్ల లెక్క తేలింది. వార్డుల పునర్విభజన అనంతరం 49 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను వార్డుల వారీగా సిద్ధం చేసి ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. బల్దియాలో 1,22,141 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 1,431 అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 60,353 ఉండగా.. మహిళా ఓటర్లు 61,784 మంది ఉన్నారు. నలుగురు ఇతరులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీల వారీగా చూస్తే బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 56.51 శాతంతో బీసీ ఓటర్లు 69,030 మంది ఉన్నారు. ఇతర కులాలకు చెందిన ఓటర్లు 25.64 శాతంతో 31,322 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 13.18 శాతంతో 16,108 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 4.64 శాతంతో 5,670 మంది ఉన్నారు. వార్డుల విషయానికొస్తే అత్యధిక ఓటర్లు 3,314 మంది 44వ వార్డులో ఉండగా.. అత్యల్పంగా ఉన్న ఓటర్లు 2,053 మంది 16వ వార్డులో ఉన్నారు. ముసాయిదా జాబితాలో ఓటర్ల కులానికి సంబంధించిన వివరాలు పొరపాట్లు తలెత్తితే ఫిర్యాదు చేసుకునేందుకు శుక్రవారం ఒక్క రోజే గడువు ఉంది. ఈలోగా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఓటరు కుల ధ్రువీకరణ పొరపాటుగా నమోదైతే 13వ తేదీన కమిషనర్ ఆధ్వర్యంలో ఓటరు కులానికి సంబంధించిన వివరాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. గడువులోగా స్పందించకపోతే ఒకవేళ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయాలకున్న వారు అనర్హులుగా మిగిలిపోతారు. 14వ తేదీన కలెక్టర్ అనుమతితో తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉండదు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ సీసీల సూచన జైనథ్ : మహిళా సంఘాల సభ్యులు తెలంగాణకు హరితహారంలో భాగస్వాములు కావాలని ఐకేపీ సీసీలు నాందేవ్, లక్ష్మి సూచించారు. గురువారం జైనథ్ మండలంలోని పూసాయి, బాలాపూర్ గ్రామాల్లో శివశక్తి, దత్తాద్రి గ్రామ సంఘాల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీలు మాట్లాడుతూ గ్రామ సంఘ సమావేశాల్లోనే బుక్ కీపింగ్‌తో పాటు ఇతర లావాదేవీలు ఎప్పటికప్పుడు నిర్వహించుకోవాలన్నారు. బ్యాంక్‌ల ద్వారా తీసుకున్న స్త్రీనిధి రుణాలను నెలనెలా చెల్లించి వడ్డీలేని రుణాలను పొందాలన్నారు. ఇక నుంచి సంఘ సభ్యుల వివరాలు డిజిటలైజేషన్ కానున్నందున సంఘ సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. గ్రామ సంఘం అధ్యక్షులు గణిత, లక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...