అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి


Sun,July 14, 2019 12:51 AM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ: అందరి భాగస్వామ్యంతో నిర్మల్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఈద్‌గాం చౌరస్తా నుంచి మంజులాపూర్ వరకు, బస్టాండ్ నుంచి చించోలి(బీ) గ్రామ శివారు వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఈద్‌గాం చౌరస్తాలో, గండిరామన్న ఆలయం వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పడడంతో రోజురోజుకూ పట్టణానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని రోడ్లను విస్తరించడంతో పాటు డివైడర్లు నిర్మించి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పలు చోట్ల పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. సుమారు రూ.70 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గత ఎన్నికల సమయంలో మున్సిపాల్టీకి నిధులు లేవని తప్పుడు ప్రచారం చేసిన నాయకులకు ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిధులు ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దురుద్ధేశంతో పనులు చేయకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేవలం రెండు రోజుల్లోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజి రాజేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మల్లికార్జున్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్, ఆకోజి కిషన్, డి.శ్రీనివాస్, పాకాల రాంచందర్, గజేందర్, సోమేశ్, మాజీ సర్పంచ్ శనిగారపు నరేశ్, కుర్ర నరేశ్, శ్రీధర్, నర్సయ్య, ఆమందుల రాజరాం తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమిపూజ
పట్టణంలోని ఈద్‌గాం, బాగులవాడ, శాంతినగర్, ఇంద్రానగర్, కుర్రన్నపేట్‌చిక్కడ్‌పల్లిల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు మంత్రి ఐకే రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మంత్రి మాట్లాడారు. నిధులు ఉన్నప్పటికీ గత పాలకులు అభివృద్ధి నిరోధకులుగా నిలిచారన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మున్సిపల్ ప్రత్యేక అధికారిణిగా నియమితులైన రెండు రోజుల్లోనే రూ.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పట్టణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మిరాంకిషన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజి రాజేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మల్లికార్జున్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్, నల్లూరి పోశెట్టి, ఆకోజి కిషన్, డి.శ్రీనివాస్, పాకాల రాంచందర్, గజేందర్, సోమేశ్, మాజీ సర్పంచ్ శనిగారపు నరేశ్, కుర్ర నరేశ్, శ్రీధర్, నర్సయ్య, ఆమందుల రాజరాం తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...