బాధితులకు అండగా ‘సీఎంఆర్‌ఎఫ్‌'


Mon,July 15, 2019 02:32 AM

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ: బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగ పడుతుందని రాష్ట్రమంత్రి అల్లోల అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నిర్మల్‌ నియోజక వర్గానికి అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. వివిధ ఆరోగ్య సమస్యలతో దవాఖానలో చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...