ఆదిమ గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య


Tue,July 16, 2019 04:26 AM

ఉట్నూర్ రూరల్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఆదిమ గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నామని గిరిజన గురుకులాల రీజినల్ కో-ఆర్డినేటర్ (ఆర్‌సీ) టి.రమేశ్ (హైదరాబాద్) అన్నారు. సోమవారం ఉట్నూర్ మండలంలోని లాల్‌టెక్‌డి గిరిజన గురుకుల పాఠశాలలో ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్ లక్ష్మయ్యతో కలిసి పీటీజీ (ప్రమోటివ్ ట్రైబల్ గ్రూప్) విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌సీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదిమ గిరిజనుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరానికి గాను హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, చెంగిచెర్లలో ఉన్న పీటీజీ ఇంటర్ కళాశాలలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి 55 మంది విద్యార్థినీ విద్యార్థులను ఈరోజు (సోమవారం) ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి కళాశాలలో ప్రవేశం కల్పించనున్నామని వెల్లడించారు. హైదరాబాద్ పీటీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బాలాజీ, ఆదిలాబాద్ ఏఆర్‌సీవో జోసెఫ్ జాన్, డీసీవో గంగాధర్, ఆదిలాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ శర్మ, సిబ్బంది ఉన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...