ముస్లిముల అభ్యున్నతికి కృషి


Sun,July 14, 2019 12:54 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : ముస్లిముల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో రూ.7 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, కొత్త బాన్సువాడలోని పెద్ద మసీదు సమీపంలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు ఆయన శనివారం శంకుస్థాపనలు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముస్లిముల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లోని ఈద్గాలు, కబ్రస్తాన్‌లు, మసీదులు, కంపౌండ్ వాల్స్ తదితర అభివృద్ధి పనులకు రూ. 11 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. బడాపహాడ్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌కు రూ. 10 కోట్లు మంజూరు చేయాలని కోరానని, త్వరలోనే మంజూరవుతాయని తెలిపారు. ఇం డ్ల స్థలాలు లేని వారికి తాడ్కోల్ శివారులో నిర్మించిన 500 డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తానని చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్, అర్‌డబ్ల్యూఎస్ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ శ్రీకాంత్, మున్సిపల్ ఏఈ అనిల్, డీఎస్పీ యాదగిరి, ఎంపీపీ దొడ్ల నీరజ, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు నార్ల సురేశ్ గుప్తా, గురు వినయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, టీఆర్‌ఎస్ నాయకులు మహ్మద్ ఎజాస్, వాహబ్, రియాజ్, ముఖీద్, హకీం, మసీదు కమిటీ సభ్యుడు తన్వీర్, అలీ, మాజీ ఉపసర్పంచ్ ఖాలిక్, పాత బాలు, దాసరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ లింగం, వీరారెడ్డి, రాము, మాజీ సర్పంచ్ బూనేకర్ జ్యోతి ఉన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...