రహదారి విస్తరణకు..బీజేపీ అడ్డుపుల్ల


Sun,July 14, 2019 12:55 AM

నిజామాబాద్ సిటీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపుల్లగా మారింది. ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా ప్రజా సమస్యలను పరి ష్కరించడంలో అడుగడుగునా అడ్డుకుంటోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధికి నిరాకరించడంపై ఆ పార్టీ నాయకులు కుళ్లు బుద్ధి బయటపడింది. హైద రాబా ద్‌లో ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రధాన రహదారులు లేకపోవ డం, రోడ్లు ఇరుకుగా ఉండడంతో ప్రజలు, వహనదారులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కా రానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతలో బైసన్‌పోలో మై దానంలో కొత్తగా సచివాలయంతో పాటు రెండు ఎలివేటడ్ ైఫ్లెఓవర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, బీజేపీ రాష్ట్ర నాయకులు దురుద్దేశంతో రక్షణ భూములను రాష్ర్టానికి కేటాయించకుండా అడ్డు తగులుతున్నారు. తెలంగాణ ప్రజల విషయంలో బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో ఈ ఘటనతో తేలిపోయింది. దీనిపై ప్రజలు బీజేపీ నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వందల సంఖ్యలో రాజధానికి..
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోంది. ఉమ్మడి నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిపోయే వా హనాలు, ప్రయాణికుల సంఖ్య పెరగుతోంది. జిల్లాల్లో ఇంజి నీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు చాలా మేరకు వివిధ సంస్థలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఏటా సుమారు వెయ్యి నుంచి రెండు వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. దీంతో వారం వారం వచ్చే పోయే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే హైదారాబాద్‌లో ప్రముఖ విద్యాసంస్థ లు, ప్రైవేటు కార్పొరేట్ దవాఖానలు ఉండడంతో ప్రతి రోజు నిత్యం వేల సంఖ్యలో సిటీకి వస్తున్నారు. ఇలాంటి అనేక కా రణాలతో హైదరాబాద్ వెళ్లే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ నుంచి ని త్యం సుమారు 50 నుంచి 100 వరకు ఆర్టీసీ బస్సులు నడు స్తుండగా.. వీటితో పాటు ప్రైవేటు ట్యాక్సీలు, వాహనాల్లో సై తం హైదరాబాద్‌కు వేల సంఖ్యలో ప్రజలు వెళ్తున్నారు. నిజా మాబాద్ నుంచి మేడ్చల్ జిల్లా వరకు కేవలం రెండు గంటల వ్యవధిలోనే చేరుకుంటున్నారు. బోయిన్‌పల్లి నుంచి సిటీలోకి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకం చూస్తున్నారు.

బోయి న్‌పల్లిలో ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రధాన రహదారులు లేకపో వడం, రోడ్లు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు, ప్రయా ణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సిటీలోకి వెళ్లాలంటే సు మారు పదుల సంఖ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను దాటుకొని వెళ్లే పరిస్థితి ఉంది. బోయిన్‌పల్లి నుంచి సిటీలోకి వెళ్లాలంటే గం టల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ సమ స్య అధిగమించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం రహదా రుల విస్తరణ, రెండు రహదారులపై రెండు ఎలివేటడ్ ైఫ్లె ఓవ ర్లు నిర్యాణం చేసే ఆలోచనకు పూనుకుంది. తద్వారా నిజామా బాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, భైంసా, నిర్మల్ ప్రాంతాల నుంచి జంటనగరాలకు వచ్చే ప్రయాణికులు, వాహనదారు లకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. ప్రజా శ్రేయస్సు, ట్రాఫిక్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బం దులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. బైసన్‌పోలో మైదానంలో సచివాలయంతో పాటు రెండు ఎలివేటడ్ ైఫ్లెఓవ ర్లు నిర్మించడానికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలని పలు మా ర్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోననే దురుద్దే శంతో భూములను రాష్ర్టానికి కేటాయించకుండా అడ్డు తగులు తోంది. రక్షణ శాఖ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకు లుఅ డ్డు తగలడంతో ఈ భూముల కేటాయింపు విషయంలో సం దిగ్ధత నెలకొంది. భూములను కేటాయిస్తే రహదారుల రూ పు రేఖలు మారడంతో పాటు ఉమ్మడి జిల్లాలైన నిజామాబా ద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి.

బీజేపీ నాయకులు సహకరించాలి
ఆరు జిల్లాలకు ఉపయోగపడే రహదారి విస్తరణ పనుల పూర్తికి బీజేపీ నాయకులు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూములు కేటాయిస్తే నిత్యం ప్రయాణం చేసే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇరుకైన రోడ్డు కారణంగా కేవలం ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతున్నది. ట్రాఫిక్ సమస్య లేకపోతే కేవలం 20నిమిషాల్లో వెళ్లాల్సిన ఐదారు కిలోమీటర్ల రహదారి గంట సమయం పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి.
- కాలయ్య, ఆర్టీసీ డ్రైవర్, నిజామాబాద్

అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు..
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రజా శ్రేయస్సును అడ్డుకోవాల్సిన హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. రాజకీయ స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. హైదరాబాద్‌లో రహదారులను విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ఆలోచన చేస్తే బీజేపీ నాయకులు అడ్డుకోవడం తగదు. రోడ్ల విస్తరణకు కంటోన్మెట్ భూములు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్డుకోవడం సరికాదు. రాజకీయాలు పక్కనపెట్టి అన్నిపార్టీలు రాష్ర్టాభివృద్ధికి సహకరించాలి.
- బావయ్య, ఆర్టీసీ సూపర్ లగ్జరీ డ్రైవర్, నిజామాబాద్

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...