మాజీ ఓఎస్‌డీ తల్లి అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు


Mon,July 15, 2019 02:36 AM

ఎడపల్లి : మండలంలోని ఠాణాకలాన్‌ గ్రామానికి చెందిన పాల్ద మహేందర్‌రెడ్డి (కేటీఆర్‌ మాజీ ఓఎస్‌డీ), ఠాణాకలాన్‌ గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పాల్ద రాజిరెడ్డి తల్లి తులసమ్మ ఆదివారం తెల్లవారు జామున మరణించారు. తులసమ్మ అంత్యక్రియలు ఆదివారం ఠాణాకలాన్‌ గ్రామంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు హైదరాబాద్‌ నగరమేయర్‌ బొంతు రామ్మోహన్‌, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకులసుజాత, నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మహేందర్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజిరెడ్డిని పరామర్శించారు. తల్లి తులసమ్మ మృతికి వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...