కస్తూర్బా గాంధీ విద్యాలయం తనిఖీ


Wed,July 17, 2019 06:14 AM

నవీపేట: మోకన్‌పల్లి కస్తూర్భ పాఠశాలను ఎంపీపీ సంగెం శ్రీనివాస్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీతో కలిసి మంగళవారం ఉదయం 10 గంటలకే పాఠశాలకు చేరుకున్నారు. ఎంపీపీ ఉపాధ్యాయులు,విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ రాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతుల గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వంటగదిలోకి వెళ్లి కూరగాయలను పరిశీలించారు. ఉల్లిగడ్డలు కుల్లిపోయి ఉండడంపై ప్రిన్సిపాల్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులకు నణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రతిదినం మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని అన్నారు. పాఠశాల ఆవరణలో ఎంపీపీ మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడ్తున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రొడ్డ సుధాకర్, ఎంపీటీసీ బేగరి జనార్దన్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, మండల నర్యవేక్షకుడు శ్రీనివాస్‌రావు, కార్యదర్శి సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ విక్రమ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నోట్ పుస్తకాల వితరణ
వర్ని: సొసైటీ ఫర్ ఆల్ ఇన్ నీడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మోస్రా మండలంలోని చింతకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ సెక్రెటరీ కామిరెడ్డి మత్తేశ్ రెడ్డి, సర్పంచ్ కర్మంగళి విమల, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...