జ్యువెలరీ షాపు దోపిడీ ముఠా అరెస్టు


Thu,July 18, 2019 04:25 AM

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లాకేంద్రంతో పాటు బోధన్ పట్టణంలోని జువెల్లరీ షాపుల్లో దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు సభ్యు లు గల మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఈ ముఠా గతేడాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎనిమిది షాపుల్లో దోపిడీకి పాల్పడి పరారైంది. వీరిపై మహారాష్ట్ర ప్రాంతంలో సైతం దొంగతనం కేసులు నమోదయ్యాయి. పోలీస్ కమిషనర్ కార్త్తికేయ బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ దోపిడీ ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్, జాల్నా ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులు జూన్ 30న అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని షాపుల్లో దోపిడీలకు పాల్పడారు. నగరంలోని వినాయకనగర్, శ్రీనగర్ కాలనీలో మూడు జ్యువెల్లరీ షాపుల షట్టర్లను ధ్వంసం చేసి దోపిడీ చేశారు. ఇందులో మొత్తం 10 కిలోల వెండి వస్తువులు, 12 తులాల బంగారు నగలు దోచుకుపోయారు. దీంతో పాటు నాలుగు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పరిధిలోని బట్టల షాపులో, అదే రోజు అర్ధరాత్రి అనంతరం బోధన్ పట్టణంలోని బంగారు షాపులో దొంగతనం చేశారు.

ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేప్పటారు. అదనపు డీసీపీ ఎం.శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో నగర సీఐ జి.నరేశ్ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది మహారాష్ట్రకు వెళ్లి దొపిడీ దొంగల కోసం అన్వేషణ కొనసాగించారు. రెండు వారాల అనంతరం దోపిడీ ముఠా సభ్యులను గుర్తించారు. దోపిడీకి పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యుల్లో ప్రస్తుతం దీపక్ సింగ్(23) మహారాష్ట్రలోని జాల్నా జిల్లా నగర్‌కు చెందిన వారు, షేక్ సద్దాం (22) మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రీ తాలూకా ఇస్లామ్‌పురాకు చెందిన వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.వీరి వద్ద నుంచి మూడున్నర కిలోల వెండి పట్టగొలుసులు, 3 తులాల బంగారు నగలను రికవరీ చేసినట్లు సీపీ కార్త్తికేయ తెలిపారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని సీపీ వెల్లడించారు. సమావేశంలో అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి, నగర సీఐ నరేశ్, నాలుగో టౌన్ ఎస్సై లక్ష్మయ్య, సిబ్బంది పాల్గ్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...