దసరా కానుకగా చిన్న కాళేశ్వరం


Thu,July 11, 2019 03:57 AM

- త్వరలోనే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తం
- జడ్పీ చైర్మన్ పుట్ట మధు
- అధికారులతో సమావేశం

మంథని, నమస్తే తెలంగాణ: ఈ దసరా కానుకగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. బుధవారం రాత్రి మంథనిలోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నులను గురించి సమీక్షించారు. ఏది ఏమైనా ఈ దసరాకు ప్రజలకు అంకితం చేయాలని ఆయన వారిని ఆదేశించారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులను 2014వరకు అధికారంలో ఉండి కూడా అసలు పనులు మొదలు పెట్టలేదన్నారు. కనీస అనుమతులు, అటవీశాఖ క్లియరెన్స్‌లు కూడా తీసుకురాకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లుఉ ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక వైపు ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేయగా అదే విధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సైతం ఈ దసరా నాటికి పూర్తి చేసే చిత్త శుద్ధితో ఉందన్నారు. రాజకీయ ప్రాభల్యం కోసం అధికారంలో ఉండి ఏమీ చేయలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరుకార్చడం సిగ్గు చేటని విమర్శించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ డీఈలు మదన్మోహన్, భాస్కరాచారి, మెగా ప్రాజెక్టు మేనేజర్ పాపిరెడ్డి, మంథని ఎంపీపీ కొండా శంకర్, సింగిల్ విండో చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, ఏఈలు హరికృష్ణ, వెంకటితోపాటు పలువురు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...