అంచెలంచెల అభివృద్ధి


Sun,July 14, 2019 01:32 AM

సుల్తానాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని పె ద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నా రు. సుల్తానాబాద్‌లో రూ.5 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులు, శ్మశాన వాటిక, కమ్యూనిటీ హల్ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ సీఆర్‌ఆర్ నిధులు, రూర్బన్ పథకం, మున్సిపాలిటీకి విడుదల చేసిన రూ.5 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాం లో ఇంతా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవన్నా రు. సుగ్లాంపల్లి, పూసాల గ్రామాలను వీలీనం చే స్తూ సుల్తానాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామనీ, అందుకు అనుగుణంగా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో సకల సౌకర్యాలతోపాటు మౌళిక వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుల్తానాబాద్‌లో ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మాజీ ఎంపీపీలు అయిల రమేష్, పారుపెల్లి రాజేశ్వరి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పార్టీ కన్వీనర్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, నాయకులు గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్, ముత్యం రమేష్‌గౌడ్, పురం ప్రేమ్‌చందర్‌రావు, కాంపెల్లి నారాయణ, పారుపెల్లి గుణపతి, కందుకూరి ప్రకాష్‌రావు, పల్లా సురేష్, సూరశ్యాం, తిప్పారపు దయాకర్, బిరుదు కృష్ణ, దికొండ భూమేష్, అనుమాల బాపురావు, కన్నె చంద్ర య్య, తుమ్మ రాజ్‌కుమార్, అడేపు అంబదాసు, పురం రమణ, అల్లెంకి శ్రీనివాస్, డాక్టర్ కలీం, బైరగోని ప్రభాకర్, బండి సంపత్, బోయిని ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...