సంక్షేమంలో మనమే అగ్రస్థానం


Mon,July 15, 2019 02:40 AM

-సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
-కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి
-మంథనిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
-ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత
-కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలి
-జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
-రామగిరిలో ముఖ్య కార్యకర్తల సమావేశం
రామగిరి : సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత పేర్కొన్నారు. రామగిరిలో ఆదివారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశానికి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుతో కలిసి ఎంపీ బోర్లకుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ ప థకాలతో తెలంగాణ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలు, కాళేశ్వరంలాంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం తో రాష్ర్టానికి ప్రత్యేక స్థానం దక్కిందని చెప్పారు. మన ప్రభుత్వ పథకాలను విశ్లేసిస్తూ ఇతర రాష్ర్టాల్లోనూ అమలు చేయడం మనందరికీ గర్వకారణమన్నారు. కార్యకర్తలెవరూ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పవద్దని కోరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంపీగా అత్యధిక నిధులు తీసుకొచ్చి, మంథని నియోజకవర్గా న్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

అండగా ఉంటాం : జడ్పీ చైర్మన్‌ పుట్ట
నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటాననీ, ఎవరూ నిరాశకు గురికావద్దని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు కోరారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో మళ్లీ తనకు ప్రజా సేవ చేసే భాగ్యం లభించిందన్నారు. మంథనిని ఎక్కువకాలం పాలించిన నాయకులు, ఇక్కడి వారిని కనీసం మనుషులుగా కూడా చూడలేదనీ, అభివృద్ధిలో వెనుకకు నెట్టి తమస్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నారని దుయ్యట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్‌లో దోచుకోవడం.. దాచుకోవడం తప్ప మరోటి తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ మూడేళ్లలో మేడిగడ్డతోపాటు మూ డు ప్రాజెక్ట్‌లు పూర్తి చేశారనీ, అదే కాంగ్రెస్‌ హ యాంలో 2004లో మొదలు పెట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ పూర్తవ్వడానికి పదేళ్లు పట్టిన విషయాన్ని గమనించాలన్నారు. మంథనిలో టూరిజం, ఫిషరీస్‌, దేవాలయాలు అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీతోపాటు జడ్పీ చైర్మన్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పూదరి సత్యనారాయణ, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ మ్యాదవేన శారద, వైస్‌ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు మైదం వరప్రసాద్‌, సర్పంచ్‌లు పల్లె ప్రతిమ, బడికెల విజయ, పాశం ఓదెలు, హరీష్‌, శంకరయ్య, కే ఓదెలు, నాయకులు ఆరెల్లి కొమురయ్య గౌడ్‌, కిషన్‌రెడ్డి, మ్యాదరవేన కుమార్‌, పుల్లెల కిరణ్‌, బుర్ర శంకర్‌ గౌడ్‌, గాజుల ప్రసాద్‌, బడికెల శ్రీనివాస్‌, అల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...