ఓపికతో విధులు నిర్వర్తించాలి


Mon,July 8, 2019 03:25 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడికి లోనవకుండా ఓపికతో కార్యాలయ విధులు నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన జేసీ మాట్లాడుతూ ఉద్యోగులు అధిక పని భారంతో ఒత్తిడికి గురవుతున్నారనీ, దానిని ఎదుర్కొని ఉత్సాహంగా ఎలా పని చేయాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు లేవనీ, ముందుగా కరీంనగర్‌లోనే నిర్వహించామని తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ద్వారానే ఉద్యోగులపై నమ్మకం, విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ సీ వీరేందర్, ఈశ్వరబాయి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భిక్షానాయక్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఏవో రాజ్‌కుమార్, తాసిల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...