వేగంగా భూ సమస్యల పరిష్కారం


Wed,July 10, 2019 02:35 AM

గన్నేరువరం: మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు మీ భూమి- మీ పత్రాలు కార్యక్రమం ద్వారా చాలా వరకు పరిష్కారమయ్యాయని జేసీ శ్యాం ప్రసాద్‌లాల్ తెలిపారు. మంగళవారం తాసిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలోని సమస్యలు, పరిష్కారమైన వాటికి సంబంధించి రికార్డులను పరిశీలించారు. అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్న భూ సమస్యలు మినహా అన్నింటినీ అధికారులు పరిష్కరిస్తున్నారని తెలిపారు. రైతులు భూ సమస్యలపై నేరుగా తాసిల్దార్‌ను కలవాలన్నారు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. సాదాబైనామా, విరాసత్‌లకు తప్పకుండా కుటుంబ సభ్యులందరూ హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జీ ప్రభాకర్, డీటీ కమ్రోద్దీన్, ఆర్‌ఐ శంకర్, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

నల్లగొండ అంగడి భూమిని కాపాడాలి
తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : మండలంలోని నల్లగొండ జాతర వద్ద అంగడి భూమిని కొందరు వ్యక్తులు తమ పేరున మార్పిడి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు మంగళవారం జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నల్లగొండ గ్రామంలో గత 65 సంవత్సరాల నుంచి పశువుల అంగడి జరుగుతున్న స్థలం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉందని తెలిపారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు అంగడి భూమిని తమ పేరు మీదికి మార్చుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారనీ, గతంలో కూడా ఇలాగే కొందరు అర్జీ పెట్టుకోగా భూమిని ఎవరికి మార్పిడి చేయవద్దని అప్పటి తాసిల్దార్‌కు వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. అంగడి స్థలాన్ని ఎవరి పేరున మార్పిడి చేయవద్దని గ్రామపంచాయతీ పేరున నమోదు చేయాలని కోరారు. అనంతరం ఆర్డీవో ఆనంద్‌కుమార్, తాసిల్దార్ పురం యుగంధర్‌లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దన్నమనేని శోభ, ఎంపీటీసీ కవ్వంపల్లి పద్మ, మాజీ సర్పంచ్ దన్నమనేని నర్సింగరావు, గ్రామస్తులు, తదితరులున్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...