లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం


Sun,July 14, 2019 01:40 AM

- సిరిసిల్ల 9వ అదనపు జిల్లా జడ్జి జయరాజ్
- జాతీయ లోక్ అదాలత్‌లో 128 కేసుల పరిష్కారం

సిరిసిల్ల టౌన్: కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల 9వ అదనపు జిల్లా జడ్జి జయరాజ్ సూచించారు. జిల్లా కోర్డు అవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి జయరాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారంలో జాప్యం జరుగుతున్నదని వెల్లడించారు. ఎవరికి నష్టం వాటిల్లకుండా ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుంటే లోక్ అదాలత్‌లో వెంటనే కేసులను పరిష్కరించువచ్చునని సూచించారు. అలా పరిష్కారమైన తీర్పులపై అ ప్పీలు ఉండదనీ, ఇరువర్గాల్లో సంతోషం నెలకొంటుందన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిడి డబ్బు, సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. సమస్యను పరిష్కరించుకోవాలి అనుకునే వారికి లోక్ అదాలత్ చక్కటి వేదికని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడీల్జు శ్రీదేవి, మంజుల, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

128 కేసుల పరిష్కారం..
జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 128 కేసులను పరిష్కరించినట్లు సిరిసిల్ల 9వ అదనపు జిల్లా జడ్జి జయరాజ్ ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సైజ్ కేసులు-111, బ్యాంక్ ప్రీ లిటిగేష్-13, మోటారు వాహన ప్రమాద కేసులు-12, బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీలిటిగేషన్ కేసులు-3 పరిష్కరించామని, రూ.64,80,428లు కక్షిదారులకు చెల్లించే విధంగా ఒప్పందం చేసినట్లు వెల్లడించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...