పేద విద్యార్థికి ఉన్నత విద్య


Mon,July 15, 2019 02:43 AM

కోనరావుపేట: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత విద్య అందిస్తున్నామ ని, వారంతా ప్రపంచ దేశాలను శాసించాలని గు రుకులాల ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని సు ద్దాల గ్రామంలో సిరిసిల్ల ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విజ్ఞాన మందిరం, జిమ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజ్రాతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పా టు చేసిన వేదికలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలను నెలకొల్పామన్నారు. అందుకు ప్రభుత్వ సహకారం ఎనలేనిదని కొనియాడారు. ప్రతి గ్రామంలో నిరుపేద విద్యార్థులు మంచి ఆలోచనతో ఎదగేందుకు సీ ఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో గల్ఫ్‌ దేశం వెళ్లినప్పుడు వారి బాధలు వర్ణణాతీతమని చెప్పారని అభివర్ణించా రు. వారు కూడా తమ బిడ్డలు సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ స్కూల్‌లో చదవివేందుకు దరఖాస్తులు అందించారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బుల్లెట్‌లాగా తయారు కావాలని ఆకాంక్షించారు.

దీంతో స్వేరోస్‌ ద్వారా 2040వ సంవత్సరానికల్లా రెండే వర్గాలు ఉండేవిధంగా చేసేందుకు ప్రతి పేద విద్యార్థి పాటుపడాలని కోరారు. అందుకోసం కుల నిర్మూలనకు ముందు భయ నిర్మూలన చేయాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల వసతులను సమాకురుస్తోందని వా టిని సద్వియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా ప్రజాప్రతినిధులతో కలిసి మొక్క నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నృ త్యాలు ఆకట్టుకున్నాయి. వేదికపై గురుకులల ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను అంబేద్కర్‌ సంఘం నాయకులు, స్వేరోస్‌ సభ్యు లు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, గ్రామప్రజాప్రతినిధులు శా లువాతో సన్మానించి సత్కరించారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యా లకొండ అరుణ, సర్పంచ్‌ ఉప్పుల దేవలక్ష్మి, ఎంపీటీసీ కాశవేణి మమత, ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, ఉపసర్పంచ్‌ నాగరాజు, వార్డుమెంబర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, శంకర్‌, కాశవేణి మహేశ్‌, ప్రదీప్‌, సుమన్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...