అన్నివర్గాల అభ్యున్నతికి కృషి


Mon,July 15, 2019 02:43 AM

-ఎంపీపీ మానస
-మండెపల్లిలో ఎంపీపీ, ఎంపీటీసీలకు సన్మానం
సిరిసిల్ల రూరల్‌: మండలంలోని అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస అన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో కమ్మటి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పడిగెల మానస-రాజు, ఎంపీటీసీ బుస్స స్వప్న-లింగం దంపతులతోపాటు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అంకారపు రవీందర్‌, పుర్మాణి రాంలింగారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మానస మాట్లాడుతూ, మండలాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో మండలాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమను సన్మానించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో అంగవైకల్యం చెందిన గ్రామ మహిళను పరామర్శించి, పింఛన్‌ అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొమ్మెటి సంఘం సభ్యులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...