ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం


Mon,July 15, 2019 02:45 AM

-జిన్‌లు కాదు జిమ్‌లు కావాలి.. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి
-విద్యార్థులను బుల్లెటుగా తయారు చేయడమే లక్ష్యం
-నిరుపేదలందరికీ ఉన్నత విద్య అందిస్తున్నాం..
-గురుకులాల ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
-సుద్దాల, ఎల్లారెడ్డిపేటలో జిమ్‌ ప్రారంభం
-పలు కార్యక్రమాలకు హాజరు
ఎల్లారెడ్డిపేట: ప్రతిరోజూ వ్యాయామానికి ప్రా ధాన్యతనిస్తూ ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామని తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు కల్లోల ప్రాంతంగా ఉన్న ఎల్లారెడ్డిపేట అటవీ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాల నుంచి అధికారులు వచ్చేవారని నాడు ‘మా ఊ రికి రండి’ అనే అధికారులు సొంత గ్రామాల్లో ఉండేందుకు చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. దాంతో వీర్నపల్లి మండలం రంగంపేట లో మొదలైన ఉద్యమం 250 గ్రామాలకు విస్తరించి జీవో నెంబర్‌ 8 వచ్చిందని దీంతో గ్రామాల్లోనే అధికారుల ఉండి ప్రజలకు సేవచేసే అవకా శం లభించిందని అన్నారు. అలాగే యువత మీడి యా, ఇతర వ్యాపకాలతో పెడదోవ పడుతున్నారని అన్నారు. అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. కల్లుసీసాలు కా దు కంప్యూటర్‌లు, జిన్‌లు కాదు జిమ్‌లను ప్రతి గల్లీలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

ప్రతి కు టుంబం ఓ జిమ్‌లా, లైబ్రరీలా మారాలని పేర్కొన్నారు. ఫిట్‌నెస్‌ను కూడా ఓ విప్లవంలా ముందు కు తీసుకువెళ్లాలని దానికి ఎల్లారెడ్డిపేట ఆదర్శం కావాలని తెలిపారు. అంతకుముందు తిమ్మాపూర్‌ స్టేజ్‌ వద్ద నుంచి ప్రారంభం అయిన 5కే రన్‌ను సీఐ రవీందర్‌ ప్రారంభించగా సదరు రన్‌లో విజేతలైన రమేశ్‌చంద్ర (నాగర్‌కర్నూల్‌), మల్లారెడ్డి (యాదాద్రి), ప్రవీణ్‌(వరంగల్‌), అఖిల, అర్చన, నాన్సికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేతుల మీదుగా సమావేశ వేదికపై నగదు బహుమతి అందజేశారు. సమావేశం అనంతరం అక్కడే ఉన్న జిమ్‌ ను ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే, సీఐ రవిందర్‌, మాజీ జడ్పీటీసీ తోట ఆగ య్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, మాజీ సర్పంచ్‌ నేవూరి మమతారెడ్డి, ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఫౌండర్‌ ఎస్‌.సదన్‌కుమార్‌, రాష్ట్ర క్రీడల అసిస్టెంట్‌ కార్యదర్శి ఎస్‌.స్వాములు, మండల విద్యాధికారి మంకురాజయ్య, ఏఎంసీ చైర్మన్‌ గుళ్లపల్లి నర్సింహారెడ్డి, వైస్‌ఎంపీపీ కదిరె భాస్కర్‌, ఫిట్‌ ఇం డియా జిల్లా అధ్యక్షులు బొద్దుల ప్రేమ్‌, ఉపాధ్యక్షుడు లింగాల సుధాకర్‌, పొత్తూరి అర్జున్‌, టీజీపీ ఏ సురేందర్‌, మారుపాకరాజు, నీరటి బాల్‌నర్సు, కులేరి ప్రేమ్‌సాగర్‌,తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...