అనుమతులు మరింత సులువు


Fri,July 19, 2019 02:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :ఇంటి అనుమతుల్లో మరింత పారదర్శకతను తెచ్చేందుకు ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టంలో అనేక కొత్త నిబంధనలను చేర్చింది. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ అధికారుల ప్రాధాన్యతను పరిమితం చేస్తూ స్వీయ ధ్రువీకరణకు ప్రాధాన్యతనిచ్చింది. జీహెచ్‌ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిం ది. కాగా, జీహెచ్‌ఎంసీకి కూడా ఇదే తరహా నిబంధనలు వర్తింపజేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలతో ఇంటి అనుమతులు అత్యంత సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. దీన్ని పూర్తిగా మార్పు చేసి పారదర్శకతను తెచ్చేందుకు, అవినీతిని నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త మున్సిపల్ చట్టానికి రూపకల్పన చేసింది. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నిబంధనలను సరళతరం చేయడంతోపాటే అంతటా వారినే జవాబుదారీగా చేశారు. అంతేకాదు, నిబంధనలను అతిక్రమించే వారికి జైలు శిక్షలు కూ డా విధించాలని నిశ్చయించారు. 75చదరపు మీటర్ల(89.69 చదరపు గజాలు) వైశాల్యంలో జీ+1వరకు నిర్మాణానికి అనుమతి పొందాల్సిన అనుమతి లేకుండా నిబంధనలు రూపొందించారు. అంతేకాదు, కార్యాలయాలకు దగ్గరగా నివాస సముదాయాలు ఉండేలా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిశ్చయించారు. 500 చదరపు మీటర్ల వరకు ఇంటి అనుమతికి స్వీయ ధ్రువీకరణ, అంతకన్నా ఎక్కువ వైశాల్యం గల వాణిజ్య, బహుళ అంతస్తుల నిర్మాణానికి సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాదు, దరఖాస్తు చేసిన 10 రోజుల్లోగా దరఖాస్తులో ఏమైనా లోపాలుంటే సమాచారం ఇవ్వాలి. 21రోజుల్లో అనుమతులు ఇవ్వాలి. లేనిచో అనుమతి జారీ చేసినట్లు పరిగణించేలా డీమ్డ్ క్లాజ్‌ను చేర్చారు. ఇంచుమించు ఇవే నిబంధనలు జీహెచ్‌ఎంసీకి కూడా వర్తింపజేసే అవకాశముందని జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...