28 నుంచి టీఎన్ పిళ్ళై ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నీ


Mon,July 22, 2019 01:18 AM

అహ్మద్‌నగర్: మాసబ్ ట్యాంక్ స్పోర్ట్స్ కోచిం గ్ ఫౌండేషన్ గ్రౌండ్ లో ఈ నెల 28 నుంచి టిఎన్ పిళ్ళై ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. దేశంలో మహిళా క్రికె ట్‌కు మార్గదర్శ కంగా నిలిచిన హైదరాబాద్ ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు దివంగత టీఎన్ పిళ్ళై జ్ఙాపకార్థం నాలుగు రోజులపాటు ఈ మీడి యా క్రికెట్ పోటీలు నిర్వహిస్తారు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ నుంచి స్పోర్ట్స్ ఎడిటర్ స్థాయికి చేరుకుని క్రీడారంగానికి విశేష సేవలందించిన టీఎన్ పిళ్ళై 4 వ ఇంటర్ మీడియా క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు నిర్వా హకులు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ఈ డే నైట్ క్రికెట్ పోటీల లో నగరంలోని ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడి యాల నుంచి సుమారు 30 కిపైగా జట్లు పాల్గొంటాయి. పోటీ లను ఇరువైపులా ఆరుగురు క్రీడాకారులు, ఆరు ఓవర్లతో అత్యంత వేగవంతంగా ముగిస్తారు. మీడియా రంగంలో జర్నలిస్టులు ఎదు ర్కొనే ఒత్తిళ్ళ నుంచి ఉప శమనం పొందేందుకు, వృత్తిరీత్యా సమయాన్ని కేటాయించలేని ఈ రంగం ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ గత నాలుగేండ్లుగా ఈ పొట్టి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. అట్ట హాసంగా నిర్వహించే ఈ పోటీలలో విజేతలకు టిఎన్ పిళ్ళై కప్‌తో పాటు పాల్గొన్న క్రీడాకారులకు బహుమతులు అందచేస్తారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...